కొండపొదుగు పాలు by శ్రీరామోజు హరగోపాల్

హరగోపాల్ గారి కొండపొదుగు పాలు చాలా అందమైన పుస్తకం. నిజం చెప్పాలంటే, ఆ కవర్ పేజీ నన్ను ఆకర్షించింది. ఇంక ఒక్కో కవిత చదవడం మొదలు పెడితే, ఆ పదాల కూర్పు ఎంత అద్భుతంగా ఉందో, మాటల్లో చెప్పలేను. ముఖ్యంగా తెలంగాణ యాసలో కవితలు ప్రత్యేకంగా అనిపించాయి. 

హరగోపాల్ గారు చాలా విషయాలను ఈ కవితల్లో ప్రస్తావించారు. దేశం లోని ప్రస్తుత పరిస్థితులు, ప్రపంచం లో పరిస్థితులు, ప్రకృతి తో మనిషి అనుబంధం, స్త్రీల సమస్యలు, స్నేహం, ప్రేమ, ఊరు..  ఇలా ఎన్నో. ఒక్క మాటలో చెప్పాలంటే వేర్వేరు, రంగు రంగు పూలను కలిపి కట్టిన పుష్పగుచ్ఛం ఈ పుస్తకం. మొత్తం వంద కవితలు. 

తీసుకో, నీవే.. అనే కవితలో ‘రోజుకు రెండు దీపాలు పెట్టే ఆకాశం, అప్పుడప్పుడు కిరోసిన్ దొరకని పేదిల్లు’ అని అంటారు హరగోపాల్ గారు. ఆ మాట కనీసం ఒక యాభై సార్లు చదివి ఉంటాను. ఇలాంటివి ఎన్నో అద్భుతమైన పోలికలు ఈ పుస్తకం లో ఎన్నో చూడొచ్చు. గదిలో సముద్రం, నది నీడలు, డెత్ సర్టిఫికెట్, నల్లపోరడు చిక్కుల్ల నా ఫేవరెట్. 

తప్పకుండా చదవాల్సిన పుస్తకం. వీలైతే తప్పక చదవండి.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.